తాండూరులో ప్లాస్టిక్ నిషేధం అమ‌లు

తాండూరు వికారాబాద్

తాండూరులో ప్లాస్టిక్ నిషేధం అమ‌లు
– వినియోగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
– ప్ర‌త్యేక బృందాల‌తో త‌నిఖీలు

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో ప్లాస్టిక్ నిషేధం అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు తెలిపారు. శ‌నివారం మున్సిప‌ల్ స‌మీపంలోని కూర‌గాయ‌ల దుకాణాలు, ఇత‌ర దుకాణాల‌లో ప్లాస్టిక్ త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మేనేజ‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ మున్సిప‌ల్ ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు ప్లాస్టిక్ నియంత్ర‌ణ త‌నిఖీలు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, కావున వ్యాపారులు… వినియోగ‌దారులు నిషేధిత ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను వినియోగించ‌రాద‌న్నారు. 75 మైక్రోన్‌ల క‌న్న త‌క్కువ సామ‌ర్థం ఉన్న ప్లాస్టిక్‌ను వినిగిస్తే.. అమ్మ‌లు చేప‌డితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, షాపుల‌ను సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌తి రోజూ ప్ర‌త్యకంగా టాస్క్‌ఫోర్స్ బృందాల‌తో త‌నిఖీలు కొన‌సాగుతాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్, జ‌వాన్లు అశోక్, శ్రీ‌నివాస్, గురు, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://youtu.be/Eb2m1ZczPHk