న‌మో ప్ర‌సన్నాంజ‌నేయ..!

తాండూరు వికారాబాద్

న‌మో ప్ర‌సన్నాంజ‌నేయ..!
– చెంగోల్‌లో కొన‌సాగుతున్న ప్ర‌తిష్టాప‌న ఉత్స‌వాలు
– దుదిని ఫీఠాధిప‌తి చెన్న బ‌స‌వ స్వామికి ఘ‌న స్వాగ‌తం
– ఆశీర్వాదం తీసుకున్న‌ సాయిపుత్ర హోమ్స్ అధినేత శంక‌ర్ యాద‌వ్
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: న‌మో ప్ర‌స‌న్నాంజ‌నేయ స్వామి అంటూ తాండూరు మండ‌లం చెంగోల్ గ్రామం భ‌క్తిపారవ‌శ్యంలో మునిగి తేలుతోంది. చెంగొల్ గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాయ‌లంలో గ‌త మూడు రోజుల నుంచి ప్ర‌తిష్టాప‌న ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. ఆల‌యంలో ధ్వజస్తంభం, శ్రీ విగ్నేశ్వర ప్రతిష్ఠాపన మహోత్సవం, ఒంటె వాహన ప్ర‌తిష్టాప‌న ఉత్స‌వాలు సోమ‌వారం క‌న్నుల పండుగ‌ల ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా ఈ ఉత్స‌వాల‌కు హాజ‌రైన దూదిని పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ చెన్న బసవప్రభు స్వామికి చేoగోల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూలవర్షం తో ఘన స్వాగతం పలికారు. ఈ ఊరేగింపులో తాండూరుకు చెందిన శ్రీ సాయి పుత్ర హోమ్స్ & డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంక‌టేశంలు స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంత‌రం జ‌య జ‌య ద్వానాల మ‌ద్య స్వామికి స్వాగ‌తం ప‌లింకారు. ఈ ఉత్స‌వాల‌లో ఎంపీటీసీ రాము, గ్రామ పెద్దలు హనుమయ్య, వెంకటేశం, గోపాల్ రెడ్డి, అంజిల్ రెడ్డి, గిరీశం , పులేందర్ శ్రీనివాస్, లక్ష్మణ్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.