అందరు దైవ చింతన కలిగి ఉండాలి
– తాండూరు డిఎస్పీ జి. శేఖర్ గౌడ్
– బ్రహ్మకుమారీ సమాజంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకుంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. తాండూరు పట్టణంలోని బ్రహ్మకుమారీ సమాజంలో ప్రతి యేడాది మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా శనివారం బ్రహ్మకుమారీ సమాజంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ హాజరై సమాజం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగిఉండాలన్నారు. శాంతి, ప్రేమ, పరమత సహనం, సరోపకారం వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలన్నారు. అంతకుముందు బ్రహ్మకుమారీ సమాజం సభ్యులు మహా శివరాత్రి విశిష్ఠతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. బ్రహ్మకుమారీ సమాజం ప్రతినిధులు జగదేవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

