తాండూరు మండల అర్చకుడికి నంది పురస్కారం
– చెన్గేష్ పూర్ హనుమాన్ ఆలయ పూజారికి దక్కిన గౌరవం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలానికి చెందిన అర్చకుడు నంది పురస్కారం అందుకున్నారు. మండలంలోని చెన్ గేష్ పూర్ గ్రామం హనుమాన్ దేవాలయంలోని ప్రధాన అర్చకులు పద్మాకరణ్ రావు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఉజ్వల సంస్కృతిక సామాజిక సేవా సంస్థ నంది పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవంలో చెన్గేష్పూర్ హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు పద్మాకర్ రావు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అర్చకుని సేవలను గుర్తించి నంది పురస్కారం అందజే యడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ప్రశాంత్ గౌడ్ తెలిపారు.

