తెగిన చేతికి చికిత్స
– మళ్లీ అతికించిన వైద్యులు
– బెంగుళూరులో అద్బుతం చేసిన డాక్టర్లు
దర్శిని డెస్క్: వైద్యం రంగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక శస్త్ర చికిత్సలతో వైద్యులో ఎందరికో ప్రాణదాతలు అవుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో వైద్యులు ఓ వ్యక్తికి అరుధైన శస్త్రచికిత్స చేశారు. ప్రమాదవశాత్తు మణికట్టు వరకు పూర్తిగా తెగి, వేరుపడిన చేతిని వైద్యులు తిరిగి విజయవంతంగా అతికించారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో మేనేజర్(55)గా పని చేస్తున్న వ్యక్తి ఇటీవల కొత్తగా వచ్చిన యంత్రాన్ని పరిశీలిస్తుండగా అతని కుడి చేయి అందులో పడి సరిగ్గా మణికట్టు వరకు తెగిపోయింది. బాధితుడిని వెంటనే బెంగళూరులోని బన్నేరుఘట్‌లో ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు సత్య వంశీ క`ష్ణ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను దాదాపు 7గంటల పాటు శ్రమించి విజయవంతంగా చేసినట్లు వివరించారు.

