చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

తాండూరు రాజకీయం వికారాబాద్

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– ఘనంగా మున్సిపల్ మేనేజర్ కుమారులు, కూతురు పుట్టుపంచె, వొల్లే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కుమారులు, కూతురు పుట్టుపంచెలు, పుట్టు వొళ్లె వేడుక ఘనంగా జరిగింది. శుక్రవారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో జరిగిన ఈ వేడుకకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేరు వేరుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే వెంట సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.