తొలిరోజు 75 మంది గైర్హాజరు..!
– తాండూరులో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
– కేంద్రాల వద్ద ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలిరోజు 75 మంది గైర్హాజరు అయ్యారు. బుధవారం తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షల సందర్భంగా పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్ కు సంబంధించి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, అంబేద్కర్ ఒకేషనల్, చైతన్య జూనియర్ కాలేజీ, సింధు బాలికల జూనియర్ కాలేజీ, సిద్దార్థ జూనియర్ కాలేజీలతో పాటు ఒకేషనల్ విభాగంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్ జేసీ, టీఎస్‌డబ్ల్యూఆర్ కాలేజీలను కేటాయించారు.
తొలిరోజు జనరల్‌లో 1781 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 42 మంది గైర్హాజరుతో 1739 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓకేషనల్ విభాగంలో 648 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 33 మంది గైర్హాజరుతో 615 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా మొదటి రోజు 2429 మందిలో 75 మంది గైర్హాజరుతో 2354 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని కస్టోడీయన్లు మల్లినాథప్ప, కృష్ణయ్యలు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తొలి రోజు ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నియమించిన అధికారులు ఆయా కేంద్రాల వద్ద పర్యవేక్షించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తదితరులు పలు పరీక్షా కెంద్రాలను సందర్శించి పరిశీలించారు.
ఇది కూడా చదవండి..

