హోలీ ఆడండి క్యాష్ గిఫ్ట్ పొందండి

తాండూరు రాజకీయం వికారాబాద్

హోలీ ఆడండి క్యాష్ గిఫ్ట్ పొందండి
– ఎల్లుండి తాండూరులో హోలీ సంబరాలు
– రూ. 50వేలు, రూ. 25 వేల బహుమతి
– హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : హోలీ ఆడండి.. క్యాష్‌ గిఫ్ట్ పొందండి అంటున్నారు తాండూరు రోహిత్‌ అన్న యువసేన సభ్యులు. ఎల్లుండి మంగళవారం తాండూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి హోలీ సంబరాలు నిర్వహిస్తున్నట్లు రోహిత్ అన్న యువసేన సభ్యులు ఓ ప్రకటనలో విడుదల చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో తాండూరు పట్టణం, తాండూరు మండలం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతో పాటు కోట్పల్లి మండలాలకు హోలీ వేడుకలలో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే హోలీ సంబరాలలో ఉట్టిని కొడితే విజేతలకు మొదటి బహుమతి కింద రూ. 50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. వేడుకలలో పాల్గొనాల్సిన వారు నియోజకవర్గం వారిగా సెల్: కింద 9392395681, తాండూరు పట్టణంకు సంబంధించి సెల్: 8978646718, తాండూరు మండలంకు సంబంధించి సెల్: 6302110363, బషీరాబాద్ మండలంకు సంబంధించి సెల్: 9948115020, యాలాల మండలంకు సంబంధించి సెల్: 9059018708, పెద్దేముల్ మండలంకు సంబంధించి సెల్: 7780692125 లకు ఫోన్ చేసి గ్రూపును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.