మీ పాన్‌ కార్డులు రద్దు కావచ్చు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

మీ పాన్‌ కార్డులు రద్దు కావచ్చు..!
– వెంటనే ఈ పని చేయండి
– మార్చి 31 వరకే గడువు
దర్శిని డెస్క్‌: దేశంలో పాన్‌ కార్డు ఉన్న వినియోగదారులకు ఇది ముఖ్య గమనిక. ఈనెల 31 వరకు ఆ పని చేయకపోతే మీ కార్డులు పనిచేయకపోవచ్చు. ఆదాయపు పన్నుకు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తున్నారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతా స్థంభించిపోతుంది. మార్చి 31లోగా మీ పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే పాన్‌ చెల్లుబాటు కాదు. దీంతో లావాదేవీలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మీ పాన్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ముందుగా ఆధార్‌తో లింక్‌ చేసి ఉండాలి.

మీ పాన్ కార్డ్ చెల్లుబాటు ఎంతవరకు ఉందో తెలుసుకోండి
ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లండి. ‘వెరిఫై యువర్ పాన్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్‌ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. మీరు సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు మరొక పేజీకి వెళ్తారు. అక్కడ మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయాలి. (OTPని స్వీకరించడానికి మీ మొబైల్ నంబర్ మీ పాన్‌కార్డుకు లింక్‌ అయ్యి ఉండాలి.) అందుకున్న OTPని నమోదు చేసి, ‘వాలిడేట్’పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డ్ సమాచారం డూప్లికేట్ చేయకపోతే చివరి పేజీలో పాన్‌కార్డు చెల్లుబాటు ఉందని, అలాగే వివరాలు పాన్‌ ప్రకారం ఉన్నాయని స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలాగే ఒకటికంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నా తెలిసిపోతుంది. మీరు ఒకే వ్యక్తిగత సమాచారంతో ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డ్‌లను నమోదు చేసుకున్నట్లయితే మరింత సమాచారం ఇవ్వాలని అక్కడ కనిపిస్తుంది. ఈ సందర్భంలో మీరు మీ తండ్రి పేరు అలాగే ఇతర గుర్తింపు సమాచారాన్ని అందించాలి.

ఆధార్-పాన్‌ లింక్‌ చేయడం ఎలా..?
ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.
ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.
ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.
కానీ మీ పాన్‌ కార్డు డూప్లికేట్‌ చేయబడిందా..? లేదా మీ పాన్‌ను ఇతరులు ఉపయోగిస్తున్నారా..? అనే విషయాలను ఎలా తెలుసుకోవాలి. ఇందు కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.