తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తకు రోడ్డు ప్రమాదం

క్రైం తాండూరు వికారాబాద్

తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తకు రోడ్డు ప్రమాదం
– హైదరాబాద్‌ అవుటర్‌ వద్ద ఘటన
– ప్రాణాపాయం తప్పిందన్నసన్నిహితులు  
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.సీ.సుధాకర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు వద్ద చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డా.సీ.సుధాకర్‌ ప్రధాన శాస్త్రవేత్తగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం విధుల్లో భాగంగా అధికారిక వాహనంలో మేడ్చల్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళుతున్నారు. అవుర్‌ రింగు రోడ్డు వద్ద ప్రమాద వశాత్తు ముందున్న వాహనం వల్ల ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ప్రమాదంలో డా.సుధాకర్‌ చేతుకు బలమైన గాయాలు అయినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి డా.సుధాకర్‌కు ప్రాణాపాయం తప్పినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.