డబుల్‌ దరఖాస్తులకు వేళాయే…!

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ దరఖాస్తులకు వేళాయే…!
– స్వీకరణకు తేదీలు ఖరారు
– పట్టణంలో ఆరు కేంద్రాల ఏర్పాటు
– ప్రకటించిన తహసీల్దార్ చిన్నప్పల నాయుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ తాండూరులో వేగవంతం అయ్యింది. లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు తేదిలను ఖరారు చేసినట్లు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 1వ తేది వరకు అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత రోజులలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. శ్రీరామ నవమి రోజు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌ రూం దరఖాస్తుల స్వీకరణ కోసం పట్టణంలో ఆరు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. 6 వార్డులకు ఒక కేంద్రం చొప్పున ఈ ఆరు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు ఫారాలు మీసేవా కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లలో లభిస్తాయని చెప్పారు.

పట్టణంలో కేటాయించిన కేంద్రాలు ఇవే..
1. వార్డ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 & 6 సంబంధించి UPHC బస్తీ దవాఖాన / చంద్రా థియేటర్ వెనుక

2. వార్డ్ నెంబర్స్ : 7, 8, 9, 10, 11 & 12 సంబంధించి క్రొత్త మున్సిపల్ కార్యాలయం

3. వార్డ్ నెంబర్స్ : 13, 14, 15, 16, 17 & 18 సంబంధించి బస్తీ దవాఖాన / అంబెడ్కర్ పార్క్, పాత తాండూర్

4. వార్డ్ నెంబర్స్ : 22, 23, 24, 25, 26, 27 & 34 సంబంధించి రైతు బజార్ (పాత ఎడ్ల బజార్)

5. వార్డ్ నెంబర్స్ : 19, 20, 21, 26, 28, 29 సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయము

6. వార్డ్ నెంబర్స్ : 30, 31, 32, 33, 35 & 36 సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయం

కావాల్సిన పత్రాలు
1. రేషన్ కార్డు
2. ఆధార్ కార్డు
3. ఓటర్ కార్డు
4. పాస్ ఫోటో 1
తప్పనిసరిగా జతచేయవలెను.