బంటు వేణు.. బంపర్ విక్టరీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బంటు వేణు.. బంపర్ విక్టరీ..!
– 909 ఓట్ల భారీ మెజార్టీతో విజయం
– దెబ్బకి చైర్మన్‌ రేసులో యువనేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుకున్నట్లే మున్సిపల్ ఎన్నికలలో సాయిపూర్ ప్రాంతం ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నికల నగారా మోగడానికి ముందే ఈ ప్రాంతంపై అందరి దృష్టి పడింది. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే నేతలే చైర్మన్‌ గిరిని దక్కించుకుంటారని అందరు చర్చించుకోవడం చూశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మద్య తీవ్ర పోటి ఉండడం ఖాయమని అందరు భావించారు.

సాయిపూర్‌ నేతల గెలుపు ఓటములు చరిత్రగా నిలుస్తాయని ఊహించారు. అనుకున్నంట్లే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిపై అల్లాపూర్ శ్రీకాంత్‌ ఘన విజయం సాధించి చర్చనీయాంశంగా మారారు. ఇదే ప్రాంతం నుంచి పోటీలో ఉన్న యువనేత బంటు వేణుగోపాల్ కూడా చరిత్ర సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవ్వరికి రానంత మెజార్టీని దక్కించుకోవడం విశేషం. ఏకంగా 909 ఓట్ల మెజార్టీతో బంటు వేణుగోపాల్ విజయఢంకా మోగించారు. దెబ్బకి మున్సిపల్ చైర్మన్ రేసులో పడ్డారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారీ మెజార్టీతో బంటు వేణుగోపాల్ బంపర్ విక్టరీని సాధించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంటు వేణు సంగతైతే చెప్పనవసరమే లేదు. అయితే పార్టీ నిర్ణయం మేరకు తన అడుగులు ఉంటాయని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్‌ పార్టీకి రొంపల్లి గిఫ్ట్..!