ఘ‌నంగా ఇందిర‌మ్మ వ‌ర్దంతి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘ‌నంగా ఇందిర‌మ్మ వ‌ర్దంతి
– నివాళులు అర్పించిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త మాజీ ప్ర‌ధాని, స్వ‌ర్గీయ ఇందిరాగాంధీ వ‌ర్దంతిని తాండూరులో జ‌రుపుకున్నారు. ఆదివారం కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్ంయ‌లో తాండూరు ప‌ట్ట‌ణంలోని ఇందిరా చౌర‌స్తాలో ఉన్న ఇందిర‌మ్మ విగ్ర‌హానికి నాయ‌కులు పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ ఇందిర‌మ్మ హాయంలోనే ఎంతో పేద‌లు అభివృద్ధి చెందార‌ని కొనియాడారు. ఆమె పాల‌న‌లోనే పేద‌ల‌కు ఇండ్లు, వైద్యం అందింద‌ని గుర్తుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు జ‌నార్ద‌న్ రెడ్డి, స‌ర్దార్ ఖాన్, స‌య్య‌ద్ షుకూర్, యూత్ కాంగ్రెస్ కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్ కుమార్, యువ‌నాయ‌కులు స‌త్య‌మూర్తి, ర‌ఘునంద‌న్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, ప‌ర‌మేశ్వ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

యాలాల మండ‌లంలో
మ‌రోవైపు యాలాల మండ‌లంలో ఇందిర‌మ్మ వ‌ర్దంతిని జ‌రుపుకున్నారు. యాలాల మండ‌ల అధ్య‌క్షులు భీమ‌య్య ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు ఇందిర‌మ్మ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో కోఆప్షన్ సంఘం జిల్లా అధ్యక్షులు అక్బర్ బాబ, క‌మాల్‌పూర్ సర్పంచ్, సీనియర్ నాయకులు చాట్ల బస్వారాజ్, రాపోల్ నాగయ్య,నాగప్ప, వడ్ల శ్రీనివాస్, రాంచెందర్, సత్యనారాయణ, గొల్ల చెందు, బోయిని రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు మలిగేరి నర్సిములు, ప్రశాంత్, బలరాం, అంజిలయ్య, ముస్తప్ప, నగేష్, ముజిబ్ త‌దితరులు పాల్గొన్నారు.