8448కు చేరిన డబుల్‌ దరఖాస్తులు

తాండూరు రాజకీయం వికారాబాద్

8448కు చేరిన డబుల్‌ దరఖాస్తులు
– నాలుగో రోజు 1374లు నమోదు
– రేపు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి గడువు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. గత నాలుగు రోజులుగా స్వీకరిస్తున్న దరఖాస్తుల సంఖ్య 8448కు చేరింది. నాలుగో రోజు శుక్రవారం 1374 దరఖాస్తులు అందాయి. డబుల్ బెడ్ రూం దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రంలో 273, కొత్త మున్సిపల్ కార్యాలయంలో 238, పాత తాండూరు బస్తీ దవాఖానలో 276, రైతుబాజర్లో 193, పాత మున్సిపల్ కార్యాలయంలోని 1 కేంద్రంలో 180, రెండో కేంద్రంలో 214 మంది దరఖాస్తులు అందించినట్లు తహసీల్దార్ చిన్నప్పుల నాయుడు వివరించారు. నాలుగో రోజు అందిన దరఖాస్తులతో సంఖ్య 8448 వరకు చేరిందన్నారు. గతంలో ప్రకటన మేరకు శనివారం దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి గడువు అని.. లబ్దిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.