బషీరాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల‌పై వేటు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బషీరాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల‌పై వేటు..!
– పదవుల‌ నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు
– తదుప‌తి ఉత్తర్వులు వ‌చ్చేంత వ‌ర‌కు స‌స్పెండ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్ర సర్పంచ్, ఉపసర్పంచ్‌ల‌పై వేటు పడింది. పంచాయితీ నిధులలో దుర్వినియోగం, అవక‌త‌వ‌క‌ల‌కు పాల్పడడం పట్ల వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల చ‌ర్య‌లు తీసుకున్నారు. వారిని పదవి నుంచి తొలగిస్తున్న‌ట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. మండల కేంద్ర సర్పంచ్ ప్రియాంక, ఉపసర్పంచ్ గా పర్వీనా భేగంలు కొనసాగుతున్నారు.
అయితే 2019-20తో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీకి మంజూ రైన 14వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం, గ్రామ పంచాయతీ నిధులలో దాదాపు రూ. 1 కోటి 13 లక్షల 557లను తాత్కాళికంగా దుర్వినియోగం చేసినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పాటు గ్రామంలో మిని ట్యాయుల నిర్మాణం విషయంలో మూడు సార్లు నిధులు డ్రా చేసినట్లు, మరో రూ. 57 లక్షల 18వేల 281ల అవకతవకలకు పాల్పడినట్లు డివిజ‌న్ పంచాయ‌తీ అధికారి ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. 2018 పంచాయతీ రాజ్ చట్టం సెక్ష‌న్ 37(1) (ఐ) మేరకు జిల్లా కలెక్టర్ సర్పంచ్, ఉపసర్పంచ్ లకు ఈనెల 7న షోకాజ్ నోటీలను జారీ చేశారు. ఈ నోటీసులను 11న సర్పంచ్, ఉపసర్పంచ్లు స్వీకరించారు. నాటి నుంచి గడువులోకి వారు ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. దీంతో జిల్లా కలెక్టర్ పంచాయతీ రాజ్ చట్టం సెక్ష‌న్ 37(1) టు (వి) ప్రకారం, సర్పంచ్ ప్రియాంక, ఉపసర్పంచ్ ప‌ర్వినాభేగంల‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వ‌ర‌కు వారు స‌స్పెండ్‌లోనే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.