ఐవీఎఫ్ కీర్తిని పెంచేందుకు కృషి
– తెలంగాణ యూత్ సెక్రటరీగా రొంపల్లి సంతోష్ కుమార్
– నియామకపత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) కీర్తిని పెంచేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త అన్నారు. తాండూరుకు చెందిన రొంపల్లి సంతోష్ కుమార్ ఐవీఎఫ్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీగా నియామకం అయ్యారు.

బుధవారం నాగోల్ లో జరిగిన యూత్ వింగ్ సమావేశంలో ఐవీఎఫ్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త రొంపల్లి సంతోష్ కుమార్ నియామకాన్ని ప్రకటించారు. ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీగా నియామకపత్రాన్ని రొంపల్లి సంతోష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐవీఎఫ్ కీర్తి, ప్రతిష్టను పెంచేలా ఆదర్శవంతమైన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. తనను వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీగా నియమించడం పట్ల జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్ గుప్త, వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి జూలకంటి అశోక్, వికారాబాద్ జిల్లా కోశాధికారి ఆగీరు మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

