అతిరుద్ర మహాయాగంలో అగ్ని జ్వాల

తాండూరు రాజకీయం వికారాబాద్

అతిరుద్ర మహాయాగంలో అగ్ని జ్వాల
– ప్రధాన యాగశాలలో ఎగిసిన మంటలు
– ఫైర్‌ సిబ్బందితో మంటల అదుపు
– యాగం సక్సెస్‌కు సంకేతమని ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం వద్ద నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. చివరి రోజు జరిగిన మహాపూర్ణాహుతిలో ఈ సంఘటన జరిగింది. మంటలు ఎగిసినా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత 11 రోజులుగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం చివరి రోజు గురువారం మహాపూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి జరిగే క్రమంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారంగా ప్రధాన యాగశాల మొత్తం వ్యాపించాయి. కాసేపటి తరువాత ఆగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా మంటలను అదుపు చేశారు. ఈ సంఘటన తరువాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన శ్రీ అతిరుద్ర మహాయాగం విజయవంతం అయ్యిందని చెప్పడానికి ప్రధా యాగశాలలో ఎగిసిన మంటలు నిదర్శనంగా వేద పండితులు పేర్కొంటున్నారని ప్రచారం చేశారు. మరోవైపు పట్టణ ప్రజలు యాగం చివరి రోజు జరిగిన సంఘటనపై అనుకూలంగా, వ్యతిరేకంగా చర్చించుకున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage