పైలెట్ గెలుపు పక్కా..!
– 10 వేల భారీ మెజార్టీ ఖాయం
– కాంగ్రెస్ వచ్చేదిలేదు, గెలిచేది లేదు
– తాండూరు మండల బీఆర్ఎస్ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో పైలెట్ గెలుపు పక్కా అని, పది వేల మేజార్టీ అందిస్తామని బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల నేతలు అన్నారు. బుధవారం నాయకులు వీరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుర్రంపల్లి మొగులప్ప, పీఏసీఎస్ డైరెక్టరీ సురేందర్ రెడ్డి, సర్పంచ్ కుర్వ నాగార్జున తదితరులు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అదేవిధంగా మెనిఫెస్టోతో పేదలకు మరింత సాయం అందించేందుకు కృషి చేస్తోందన్నారు. తాండూరులో నేతలు, ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని. కొంత మంది స్వార్థం కోసమే పక్కపార్టీలోకి వెళ్లారని అన్నారు. ఎంతమంది వెళ్లినా కూడా ఎన్నికల్లో పైలెట్ గెలుపు, 10 వేల మెజార్టీ ఖాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

