ఎల్‌ఐసీలో మహిళలకు బెన్‌ఫిట్ పాలసీ
– రోజు రూ.87 డిపాజిట్‌కు రూ. 11 లక్షల ఆధాయం
– ఇంకా మరిన్ని ప్రయోజనాలు
దర్శిని డెస్క్: దేశంలో అందరికి ప్రయోజనమైన పథకాలను అందజేస్తున్న సంస్థల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఒకటి. వినియోగదారుల కోసం ఎప్పటి కప్పుడు వినూత్న పథకాలను అమలు చేస్తూ మంచి ఆధరణ పొందింది. ఇలాంటి సంస్థలో మహిళల కోసం ప్రత్యేక పాలసీ తీసుకవచ్చింది. గత నాలుగు సంవత్సరాలలో గణనీయమైన స్పందనను పొందింది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించడం ఈ పథకం ప్రత్యేకత. ఈ పథకం బీమా రక్షణతో పాటు మంచి పొదుపు ఉంటుంది.
ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన అనేది మహిళల కోసం రూపొందించబడిన నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఇది కస్టమర్ కుటుంబానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడు మరణిస్తే అతని కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. మహిళలు రోజుకు 87 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఈ పథకంలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకం చాలా కాలం పాటు డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. మహిళలు 15 ఏళ్ల వయసులో రోజుకు రూ.87 డిపాజిట్ చేస్తే, ఏడాదికి మొత్తం రూ.31,755 ఆదా అవుతుంది. అదే విధంగా 10 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేస్తే రూ. 3,17,550 ఉంటుంది. ఆ తర్వాత, మెచ్యూరిటీ సమయంలో మొత్తం దాదాపు రూ. 11 లక్షలు లభిస్తుంది.
ఆధార్ శిలా యోజన యొక్క మెచ్యూరిటీ వ్యవధి 10-20 సంవత్సరాలు. అంటే, ఈ పాలసీని 20 సంవత్సరాల వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఎల్‌ఐసీ ప్లాన్ మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. ఒక మహిళ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఆమె రూ. 3 లక్షల వరకు ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ కింద కింద కనీస మొత్తం బీమా మొత్తం రూ .75,000. గరిష్టంగా రూ. 3 లక్షలు. ఈ పథకంలో ప్రతి నెలతో పాటు, 3 నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రీమియం చెల్లించవచ్చు.

