ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
– తాండూరు కలెక్టర్ కు బీఎస్ఆర్ వినతి
– సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) కోరారు. గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సబ్ కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి తాండూరు సబ్ కలెక్టర్ హోదాలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ తో శ్రీనివాస్ రెడ్డి పలు సమస్యలపై చర్చించారు. తాండూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తాండూరు గర్వించేలా సేవలను అందించాలని ఆకాంక్షించారు.
ఇదికూడా చదవండి…

