స్పూర్తి ప్రధాత స్వామి వివేకానంద

తాండూరు రాజకీయం వికారాబాద్

స్పూర్తి ప్రధాత స్వామి వివేకానంద
– తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు
– 162 మంది వివేకానంద వేషాధారణలో విద్యార్థులు
– నివాళులు అర్పించిన నాయకులు, సంఘాల ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద స్పూర్తి ప్రధాత అని తాండూరుకు చెందిన పలువురు కొనియాడారు. ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను నిర్వహించారు. తాండూరు పట్టణం శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తాండూరు ప్రముఖులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌరస్తా, వినాయక చౌరస్తా మీదుగా రన్ ఫర్ యూత్ అనే కార్యక్రమం నిర్వహించారు.

పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన 162 మంది విద్యార్థులు స్వామి వివేకానంద వేషాధారణలో స్కూల్ నుంచి వివేకానంద విగ్రహాం వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. విద్యార్థుల వేషాధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వివేక్ సేవా సమితి సభ్యులు, బీసీ సంఘం సంఘం నాయకులు, పలువురు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి, యువతకు స్పూర్తి దాయకుడని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, హిందూ ధార్మిక పరిషత్ నాయకులు బస్వరాజు, కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, టీచర్లు, వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

పది నిమిషాల్లో పనిముగించారు..!