గతంలో లేని ఘనమైన ప్రగతి
– మాతోనే తాండూరుకు సరికొత్త రూపు
– మోసి చేసిన పాలకులను నమ్మొద్దు
– పార్టీలకతీతంగా అన్ని వార్డులకు రూ. 1కోటి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– గల్లీ గల్లీకి పైలెట్ సూపర్ హిట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గతంలో ఏ పాలకులు చేయని ఘన మైన ప్రగతిని సాధించుకున్నామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టిన గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణంలోని 19 వార్డుల్లో కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన గల్లీ గల్లీకీ పైలెట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై రూ. 1 కోటి చొప్పున మంజూరు చేసిన నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

ఆయా వార్డుల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హాయాంలో 40ఏండ్లుగా జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, రోడ్ల విస్తరణ, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంగన్ వాడి భవనాలు వంటి అభివృద్ధి పనులను చేపట్టడం. జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కాక ముందు అయినా తరువాత ఎంతో అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తించుకోవాలని, పదే పదే చర్చించుకోవాలన్నారు. ఇన్నేళ్లు మోసం చేసిన గత పాలకులు మళ్లీ వస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మళ్లీ మోసపూరిత హామిలను నమ్మొద్దన్నారు. గతంలో ఏం అభివృద్ధి చేశారని వారిని నిలదీయాలని అన్నారు. గత మూడేళ్లు ఎన్నికలు, కరోనా మహా వామ్మారి వల్ల అభివృద్ధి చేయలేకపోయామని, రానున్న రోజులలో తాండూరు అభివృద్ధే ధ్యేయంగా, ప్రగతి పట్టుదలతో ముందుకు సాగుతామన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాండూరు బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. మరోవైపు ఎమ్మెల్యేకు స్వాగతాలు, సన్మానాలతో గల్లీ గల్లీకి పైలెట్ సూపర్ హిట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మున్సిపల్ వై స్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, విజయాదేవి, మంకాల రాఘవేందర్, ప్రభాకర్ గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

