అమ్మను కొట్టి.. ఆపై పురుగులమందు సేవించి
– ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాగిన మైకంలో అమ్మను కొట్టిన ఓ కుమారుడు మనస్థాపం చెంది పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వి వరాలిలా ఉన్నాయి. మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన నీలగిరి రాంచంద్రి అలియాస్ రాంచెందర్ (29) గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిస అయ్యాడు. ఈక్రమంలో గురువారం ఉదయం తాగిన మైకంలో తల్లి నీలగిరి రాములమ్మతో గొడవ పడి ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తాండూరులో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్లింది. అయితే తల్లిని కొట్టానని మనస్థాపం చెందిన రాంచంద్రి అదేరోజు మధ్యాహ్నం గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పక్కింటి పసన్ గారి వెంకటేష్ గ్రామస్తుల సహాకారంతో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాంచంద్రి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

