ఎంసీహెచ్‌ అభివృద్ధికి కృషి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంసీహెచ్‌ అభివృద్ధికి కృషి
– మాతా శిశు ఆసుపత్రి సేవలు మెరుగు పర్చాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం ఎంసీహెచ్‌ ఆసుపత్రిలో డీఎంఎఫ్టీ ద్వారా మంజూరైన రూ. 50 లక్షల నిధులతో వేయిటింగ్ హాల్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మాతా శిశు ఆసుపత్రి సేవలు అభినందనీయమన్నారు. మాతా శిశు ఆసుపత్రి అభివృద్ధికి తమ కృషి చేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఆసుపత్రిలో మౌళిక వసతులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఆసుపత్రి వైద్యులు రోగులకు, గర్భిణీ, బాలింతలకు ఆదర్శవంతమైన సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవి శంకర్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు విజయదేవి, సంగీత ఠాకూర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్‌ గౌడ్, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.