స్వయం ఉపాధే జీవితానికి రాచమార్గం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– లబ్దిదారులకు కార్లు, ఎలక్ట్రిక్ ఆటో అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వయం ఉపాధికి వారి జీవితానికి రాచమార్గం అవుతోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. దళితబంధు పథకం కింద బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన మాల ఎల్లప్ప, మాల బసప్ప, మాల రమేష్‌లకు కార్లు మంజూరయ్యాయి. అదేవిధంగా అదే మండలంకు చెందిన తిరుపతయ్యకు ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కింద 60 శాతం సబ్సీడీతో ఎలక్ట్రిక్ ఆటో మంజూరైంది. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన చేతుల మీదుగా లబ్దిదారులకు కార్ల తాళాలు, ఎలక్ట్రిక్ ఆటో ప్రోసిడింగ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు సాధికారతను సాధించేందుకు సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారంతా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అదేవిధంగా అర్హులైన వారు సబ్సీడీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. స్వశక్తితో కష్టాలను అధిగమించి.. ఉన్నతంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ మల్లప్ప, నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

