10వ తేది లోపే ఇంటర్ రిజల్ట్
– బోర్డు అధికారుల వెల్లడి
– ఫలితాలను ఎలా చూసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు తెరపడబోతోంది. తెలంగాణలో ఈనెల 10వ తేదీలో ఇంటర్ రిజల్ట్ విడుదల చేయనున్నట్లు TSBIE కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు ఫలితాలను cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in సైట్లను విజిట్ చేసి తెలుసుకోవచ్చు. TS ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడానిక విద్యార్థి ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు సాధించాలి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను చెక్ చేయడానికి, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత, విద్యార్థులు మార్కుల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. tsbie.cgg.gov.inలో ఫలితాలు ప్రకటించిన వెంటనే అందుకు సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లలో కాకుండా మొబైల్ యాప్ ‘టి యాప్ ఫోలియో’లో కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

