సిట్ విచారణకు హాజరైన తాండూరు నేతలు
– స్టేట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
– విచారణకు సహకరించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నుంచి పిలుపు అందుకున్న కొందరు తాండూరు, నేతలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు విచారణకు హాజరయ్యారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో స్టేట్ మెంట్ ఇచ్చారు.

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డా.సంపత్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి (చిట్టిగణాపూర్ హెచ్ఎం), కాంగ్రెస్ యువ నాయకులు మహిపాల్ రెడ్డి, వికాష్ జోషి, విష్ణు తదితరులకు సిట్ నుంచి విచారణకు హాజరుకావాలని పిలుపు అందిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండల నాయకులు మహిపాల్ రెడ్డి, యువ నాయకులు వికాష్ జోషి, విష్ణు తదితరులు వి చారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ లో సిట్ అధికారులకు తమ వాంగ్మూలం అందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమైనా లేదా ఎవరిపైనా అయిన అనుమానాలు ఉన్నారా..? అని అడిగినట్లు తెలిసింది. ఫోన్ నెంబర్లు మీవేనా కాదా అని అడిగి స్టేట్ మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరిని సుమారు 10 నుంచి 15 నిమిషాల వరకు విచారణ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాండూరు నుంచి మరికొందరు నేతలు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఇదికూడా చదవండి…

