ఆటాడుదాం రండి..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఆటాడుదాం రండి..!
– ఈనెల 15 నుంచి సీఎం కప్‌ క్రీడా పోటీలు
– ఎల్లుండిలోగా దరఖాస్తు చేసుకోండి
– ఏయే పోటీలు నిర్వహిస్తున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రీడలు మానసిక, శారీరక ధృఢత్వానికి దోహద పడతాయి. ఉల్లాసాన్ని.. ఉత్సహాన్ని అందించే క్రీడల్లో అందరు పాల్గొనాలని తాండూరు మండల పరిషత్ అధికారులు పిలుపునిస్తున్నారు. ఈనెల 15వ తేది నుంచి తాండూరులో సీఎం కప్‌ మండల స్థాయి క్రీడా పోటీసులు నిర్వహించడం జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండల ఎంపీపీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలో ఉన్న సెయింట్ మార్క్స్‌ హై స్కూల్‌ గ్రౌండ్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో 15 ఏండ్ల నుంచి 36 ఏండ్లు ఉన్న క్రీడాకారులందరు పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎల్లుండి 12వ తేది సాయంత్రం 5 గంటల లోపు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఆధార్‌ కార్డును జతచేసి దరఖాస్తును అందించాలని సూచించారు. మరోవైపు క్రీడా పోటీలకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు.

ఇది కూడా చదవండి…

ఐపీఎస్‌ అధికారికే మస్కా..!
– దోశ బిల్లు కట్టించే ప్రయత్నం
– వైరల్ అయిన సంఘటన
https://dharshininews.com/17059