ఆర్. కృష్ణయ్య పోరాటం అందరికి తెలియాలి
– గ్రామ స్థాయి నుంచి బీసీల ఉద్యమం
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య బీసీల కోసం చేస్తున్న పోరాటాలు అందరికి తెలియాలని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీ సంఘం ఏర్పాటై 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని హోటల్ అభినందన్ గ్రాండ్లో రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా నుంచి కందుకూర్ రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో 50 ఏండ్లుగా ఆర్. కృష్ణయ్య చేస్తున్న పోరాటాలు అందరికి తెలిపేందుకు గ్రామస్థాయి నుంచి పట్టణ సాయి, జిల్లాల స్థాయి వరకు బీసీల ఉద్యమాన్ని చేపట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. అనంతరం ఆర్. కృష్ణయ్య కందుకూరి రాజ్ కుమార్ ను అభినందించి.. సన్మానించారు.
ఇదికూడా చదవండి…

