‘ముచ్చట’యిన భేటీ..!
– ఆసక్తికరంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలయిక
– ఇరువర్గాలలో జోరుగా చర్చలు
– రాజకీయ పరిణాలపై మాటామంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా రాజకీయాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు భిన్నమైన ప్రయాణం జరుగుతోంది. ఇద్దరు నేతల మద్య వర్గపోరు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుండడం జరుగుతూనే ఉంది. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత విభేధాలు ఉన్నాయనేది కాదనలేని నిజం. ఇలాంటి పరిణామాల మద్య ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సంఘటన ఇరువర్గాలలో ముచ్చటగా మాట్లాడుకునేందుకు దారి తీసింది. అదికూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు పట్టణంలో ఇటీవల నూతన ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జూన్ 7న గృహ ప్రవేశ వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆహ్వాన పత్రాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైదరాబాద్ లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. గృహ ప్రవేశ ఆహ్వానం అందించడానికి వెళ్లినా.. ఇద్దరి భేటిలో ఆసక్తికర చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తాండూరులో కొనసాగుతున్న రాజకీయ, అభివృద్ధి పనులపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఇద్దరి భేటిపై తాండూరులో ఇరువర్గాలకు చెందిన నేతలు వివిధ రకాలుగా చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడ చదవండి…
వేటకొడవలితో 18 పోట్లు…!
– అన్నను చంపిన తమ్ముడి రిమాండ్
– వివరాలను వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి
https://dharshininews.com/17366


