గంజాయి ముఠాకు చెక్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గంజాయి ముఠాకు చెక్..!
– బీదర్ నుంచి తెచ్చి తాండూరులో అమ్మకం
– నలుగురిని రిమాండు చేసిన పోలీసులు
– 1కేజీకి పైగా ప్యాకెట్ల స్వాదీనం
– వివరాలు వెల్లడించిన టౌన్ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కర్ణాటక నుంచి గంజాయి తెచ్చి తాండూరులో విక్రయిస్తున్న ముఠాకు వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు చెక్ పెట్టారు. యూత్‌ టార్గెట్‌గా వ్యాపారానికి తెగించిన నలుగురు నిందితులను రిమాండుకు తరలించారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మాణిక్ నగర్ కు చెందిన జాదవ్ అరవింద్ (26), గొల్లచెరువుకు చెందిన అక్రమ్ (22), చాకలి బాబు (40), ఇందిరానగర్ కు చెందిన సయ్యద్ ఆసీఫ్ (20)లు కర్ణాటక బీదర్ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి తాండూరు పట్టణంలోని యువతకు విక్రయిస్తున్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద ప్యాకెట్ల ద్వారా గంజాయి విక్రయిస్తుండగా పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సిబ్బందితో కలిసి నిందులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1కిలో 158 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకుని తాండూరు తహసీల్దార్ ముందు హాజరు పరిచారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చె సిన న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాలతో వారిని రిమాండు చేయడం జరిగిందని వివరించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage