గర్భవతులకు గుడ్ న్యూస్
– జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని గుడ్ న్యూస్ తెలిపింది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి మంగళవారం మరియు శనివారం రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భవతులకు స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లిఖార్జున స్వామి వెల్లడించారు. ఈ సేవలను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

