రేషన్‌కు హెల్ప్ లైన్..!
– మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు
– తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం
దర్శిని డెస్క్: దేశంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. రేషన్ షాపులను నిర్వహించే డీలర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హులైన వారికి రేషన్ ఇవ్వకపోవడం, లేదంటే తూకంలో మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా ఉన్నాయి. రేషన్ విషయంలో డీలర్లు ఏదైనా ఇబ్బందులకు గురి చేయడం, మోసానికి పాల్పడటం వంటివి చేస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. ప్రతి రాష్ట్రానికి ప్రభుత్వం రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. ఈ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ వచ్చిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఎలా కంప్లైట్ చేయాలంటే..?
రాష్ట్రానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌లు ప్రకటించారు. ఇందుకోసం, అధికారిక వెబ్‌సైట్ https://nfsa.gov.in/ను సందర్శించవచ్చు. ఇక్క ఆయా రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్‌ల లిస్ట్ ఉంటుంది. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత సంబంధిత డీలర్‌పై విచారణ జరుపుతారు. తప్పు తేలితే, డీలర్‌షిప్ క్యాన్సిల్ చేయడమే కాకుండా.. జరిమానా విధించడం, జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది.
రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్‌లివే..
ఆంధ్రప్రదేశ్: 1800-425-2977
అరుణాచల్ ప్రదేశ్: 03602244290
అస్సాం: 1800-345-3611
బీహార్: 1800-3456-194
ఛత్తీస్‌గఢ్: 1800-233-3663
గోవా: 1800-233-0022
గుజరాత్: 1800-233-5500
హర్యానా: 1800-180-2087
హిమాచల్ ప్రదేశ్: 1800-180-8026
జార్ఖండ్: 1800-345-6598, 1800-212-5512
కర్ణాటక: 1800-425-9339
కేరళ: 1800-425-1550
మధ్యప్రదేశ్: 181
మహారాష్ట్ర: 1800-22-4950
మణిపూర్: 1800-345-3821
మేఘాలయ: 1800-345-3670
మిజోరం: 1860-222-222-789, 1800-345-3891
నాగాలాండ్: 1800-345-3704, 1800-345-3705
ఒడిషా: 1800-345-6724 / 6760
పంజాబ్: 1800-3006-1313
రాజస్థాన్: 1800-180-6127
సిక్కిం: 1800-345-3236
తమిళనాడు: 1800-425-5901
తెలంగాణ: 1800-4250-0333
త్రిపుర: 1800-345-3665
ఉత్తర ప్రదేశ్: 1800-180-0150
ఉత్తరాఖండ్: 1800-180-2000, 1800-180-4188
పశ్చిమ బెంగాల్: 1800-345-5505
ఢిల్లీ: 1800-110-841
జమ్మూ: 1800-180-7106
కాశ్మీర్: 1800-180-7011
అండమాన్ & నికోబార్ దీవులు: 1800-343-3197
చండీగఢ్: 1800-180-2068


