ఓటమి గుణపాఠం సరిపోదా..!
– పైలెట్ అభివృద్ధి పచ్చి మోసం
– బోగస్ కాగితాలతో గారడి
– ఎమ్మెల్యే చొవరతో తాండూరు ప్రగతి
– ఓర్వలేక విమర్శలు చేస్తే ఖబడ్దార్
– కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐదేళ్లు చేసిన మోసానికి ఎన్నికల్లో ప్రజలు ఓడించినా మాజీ ఎమ్మెల్యేకు గుణపాఠం సరిపోలేనట్లుగా ఉందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సోదరుడు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ప్రభుత్వంపై పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన విమర్శనలను ప్రభాకర్ గౌడ్ ఖండించారు. గతంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా రోహిత్ రెడ్డి బోగస్ ప్రోసిడింగ్ లతో అభివృద్ధిని గారడి చేశారని విమర్శించారు.
ఆర్థిక ఆమోదం లేకుండానే చిలుకవాగు అభివృద్ధిపై దొంగ జీవో తీసుకవచ్చారని, ఇలాంటి దొంగ జీవోలు చాలా ఉన్నాయని ఆరోపించారు. చెత్త కాగితాలతో ప్రజలను మోసం చేసిన ఘనత రోహిత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. తాండూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపడంతో త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఇసుక నియంత్రణ విషయంలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కృషి చేశారని, దాని వల్ల ఆక్రమ రవాణా తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆధాయం పెరిగిందన్నారు.
రోహిత్ రెడ్డి కుటుంబం వల్ల గతంలో ఇసుక మాఫీయా ఏర్పడిందని అందరికి తెలుసన్నారు. మరోవైపు తాండూరులో నాలుగు గోడల మద్య గౌడ సంఘం మోసం చేస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గౌడ్ల అందరికి లాభాలు పంచాలనే ఉద్దేశంతో సంప్రదాయం తీసుకవచ్చారని అన్నారు. నీతివంతమైన పాలన చేస్తున్న ఎమ్మెల్యే, అతని సోదరులపై రోహిత్ రెడ్డి, అనుచరులు ఓర్వలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే, సోదరులపై విమర్శలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

