మూడోసారి ముమ్మాటికి మోడే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మూడోసారి ముమ్మాటికి మోడే..!
– బీజేపీ సర్కారుకు అన్నివర్గాల మద్దతు
– పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలి
– మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– యాలాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో మూడో సారి ప్రధాని అయ్యేది నరేంద్రమోడీయే అని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎదురులేని విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం యాలాల మండలంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర విజయవంతంగా కొనసాగింది. మండలంలోని రాస్నం, రాఘవపూర్, పగిడ్యాల్, కోకట్, లక్ష్మీనారాయణ పూర్, అగ్గనూర్ తదితర గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది.

యాత్రలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందరిని పలకరిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కొండా పిలుపుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోడి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. కరోనా సమయంలో కోట్లాది మందికి ఉచితంగా వాక్సిన్ అందించారని గుర్తుచేశారు. అందుకే దేశ ప్రజలంతా మరోసారి మోడీ సర్కారును కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణాలో రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సీఎం కేసీఆర్ అందరి కల్లుగప్పి తమ నిధులంటూ గొప్పలు పోయారని విమర్శించారు.

విద్యా.. వైద్య రంగాలలో తెలంగాణను వెనుకబాటుకు గురిచేశారని అన్నారు. దేశంలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించుకోవచ్చన్నారు. మూడో సారి దేశంలో నరేంద్ర మోడి ప్రధాని కావడం ఖాయమన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, నాయకులు యు.రమేష్ కుమార్. మల్లేష్ యాదవ్, రజనీకాంత్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు