అల్విన్ అనంత్ రెడ్డి కన్నుమూత

తాండూరు రాజకీయం వికారాబాద్

అల్విన్ అనంత్ రెడ్డి కన్నుమూత
– గుండెపోటుతో తుదిశ్వాస
– సంతాపం తెలిపిన రాజకీయ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండల సీనీయర్ బీఆర్ఎస్ నేత, నవాంద్గి పీఏసీఎస్ మాజీ చైర్మన్ అల్విన్‌ అనంత్ రెడ్డి కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. బషీరాబాద్‌ మండలంలో అల్విన్‌ అనంత్ రెడ్డి మంచి నేతగా పేరుపొందారు. హైదరాబాద్‌లోని అల్విన్‌ కంపెనీలో పనిచేయడంతో ఆయనకు అల్విన్‌ అనంత్ రెడ్డి అని పేరు వచ్చింది. అక్కడ ఆయన కార్మిక నాయకుడుగా కూడా పనిచేశారు. బషీరాబాద్‌ మండలం నావాంద్గి పీఏసీఎస్ చైర్మన్‌గా ఆయన రైతులకు విశేష సేవలను అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే వర్గంలో ఉన్నారు. ఆయన సోమవారం బషీరాబాద్‌ మండలం రెడ్డిగణాపూర్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురై కన్నుమూసినట్లు తెలిసింది. ఆయన మరణ వార్త తెలిసిన నేతలు, ఇతర పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఇది కూడా చదవండి…
రేషన్‌కు హెల్ప్‌ లైన్..!
– మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు
– తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం
https://dharshininews.com/17434
chaithany collage