ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండ
– సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల బీమా
– తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని 12వ బూత్‌లో ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ ఎన్‌రోల్ మెంట్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు బూత్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి పార్టీ ఎన్‌రోల్‌మెంట్ సభ్యత్వ నమోదును చేపట్టారు. అక్కడి నుంచే సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను డిజిటలైజ్ చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అవగాహన కల్పించారు.
అనంతరం పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొ వడం కార్యకర్తకు గౌరవమన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు రూ. 2 లక్షల భీమా సదుపాయం లభిస్తుందని అన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రధాన్యముంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి నవాజ్, మైనార్టీ నాయకులు ఖాలేద్, సీనియర్ నాయకులు ఖయ్యూం, నారా అశోక్, నర్సింహా, చంద్రశేఖర్, మైనార్జీ టౌన్ ప్రెసిడెండ్ రియాజ్, సోహిల్, మోహిజ్ తదితరులు పాల్గొన్నారు.

