గ్రాండ్‌గా పీఎంఆర్ టోర్నమెంట్

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రాండ్‌గా పీఎంఆర్ టోర్నమెంట్
– క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన రినీష్‌ రెడ్డి
– క్రీడల్లో సత్తాచాటాలని పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. సోమవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పట్టణ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్‌ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. టోర్నమెంట్‌కు హాజరైన క్రీడాకారులతో రినీష్‌ రెడ్డి కరచాలనం చేసి.. బ్యాటింగ్‌ చేసి.. టోర్నమెంట్‌ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా కారులు అందరూ ఉత్సవంగా అడి క్రీడల్లో సత్తా చాటాలన్నారు. గ్రామీణ, పట్టణ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్ మాట్లాడుతూ నాలుగు మండలంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ లో క్రీడాకారులు పాల్గోని జయప్రదం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు పట్నం రీనిష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలతో పాటు వైద్య శిబిరాలు, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్, PACS చైర్మెన్ రవి గౌడ్, ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, కౌన్సిలర్లు నీరజ బాల్ రెడ్డి, , ప్రవీణ్ గౌడ్, మణపురం రాము, బోయ రవి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి, గడ్డల రవీందర్, మసూద్, మన్మోహన్ సార్డా, కేశవ్ రావు, బీదర్ రాజ్ శేకర్, లింగం, అఫ్సర్, అమ్జీద్, దావులయ్యి, హరిశ్వర్ రెడ్డి, రఘు, రాష్ట్ర యూత్ కార్యదర్శి బి.రఘు, మాజీ యూత్ పట్టణ అధ్యక్షుడు తాండ్ర రాకేష్, అశోక్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, తాండూరు మండలం నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పిడుగుల భీభత్సం

chaithany collage