మార్మోగిన శరణు గోష..!
– బాల్రెడ్డి నివాసంలో ఘనంగా పడిపూజ
– తరలివచ్చిన స్వాములు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శరణం.. అయ్యప్ప స్వామి.. అంటూ తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్లో మణికంఠ నామస్మరణం మార్మోగింది. బుధవారం సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల బాల్ రెడ్డి నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మద్య పడిపూజను భక్తిశ్రద్ధలతో జరిపించారు. మెట్లపూజలో అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు మార్మోగాయి. పూజ అనంతరం బాల్ రెడ్డి స్వాములకు సద్ది నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు, భక్తులు, నేతల రాకతో వారి నివాస ప్రాంగణం కిక్కరిసి పోయింది. ఈ పూజలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, నేతలు బంటు మల్లప్ప, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయరవి, వెంకన్న గౌడ్, అంతారం లలిత, సంగీత ఠాకూర్, సింధూజ గౌడ్, బంటారం లావణ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనీయర్ పాత్రికేయులు శ్రీనివాస్ చారి, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, గోశాల సభ్యులు రాము, న్యాయవాది గుండప్ప, మల్లా రెడ్డి, పటేల్ విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనురాధ తదితరులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మరోవైపు పడిపూజ అనంతరం బాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పూజకు తరలివచ్చిన నేతలు, అభిమానులు ఆయను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


