ఎనీటైమ్.. టీ.. కాఫీ..!
– ప్రపంచంలోనే తొలి మిషన్
– మన హైదరాబాద్‌లో ఆవిష్కరణ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఏటీఎం.. అంటే అందరికి ఎనీటైమ్ అనే పధం గుర్తుకొస్తుంది. అంతలా మొదడులో గుర్తిండి పోయిన ఏటీఎం పేర్లతో ఎన్నో ఆవిష్కరణలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అందరిని ఆకర్షించేలా ఎనిటైమ్ మిషన్లు, ఆవిష్కరణలు పుట్టుకొచ్చి ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలోని మన హైదరాబాద్‌లో ఇలాంటి కొత్త ఆవిష్కరణలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఏర్పాటైన ఆవిష్కరణ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే తొలి టీ, కాఫీ, వాటర్ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్‌ను ప్రాంరభించారు. పూర్తిగా ఆటోమెటెడ్‌గా పనిచేసే ఈ మిషిన్‌ను గురువారం నగరంలో అందుబాటులోకి తెచ్చారు. మెషిన్‌పై ఉండే QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీకు కావాల్సిన కాఫీ, టీ, వాటర్ వస్తువులను సెలక్ట్ చేసుకోవచ్చు.
జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందిచిన ఈ మిషన్ ప్రంపంచలో తొలి టీ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్‌గా పేరు తెచ్చుకుంది. పి. వినోద్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆటోమేటెడ్ వెండింగ్ మెషీన్‌ను రూపొందించారు. హైటెక్ సిటీలోని అవాసా హోటల్లో నిర్వహించిన మెషిన్ ప్రారంభోత్సవానికి ఎంపీ రంజిత్ రెడ్డి, సిటీ నటుడు మంచచు మనోజ్‌తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మెషిన్స్ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని వినోద్ కుమార్ చెబుతున్నారు. వినోద్ కుమార్ ఆవిష్కరణను ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా పి. వినోద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశంలో సాధారణ ప్రజలకు వెండింగ్ మెషీన్లు అందుబాటులో లేవు, ఇండియాలో 100 మాల్స్‌లో కేవలం ఒక మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. బ్యాంకు రుణంతో పాటు బీమా సౌకర్యంతో ఈ మిషిన్స్‌ను అందుబాటులోకి తీసుకునున్నారు. రిఫ్రిజిరేట్ కంటే తక్కువ ధరకే ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి…


