పట్నం నరేందర్ రెడ్డికి విడుదల

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పట్నం నరేందర్ రెడ్డికి విడుదల
– రేపు జైలు నుంచి బయటకు
– కోర్టు బేయిల్ మంజూరుతో ఊరట
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్ల కేసులో కోడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి విడుదల లభించనుంది. బుధవారం పట్నం నరేందర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్నం నరేందర్‌రెడ్డి రూ.50వేల పూచీకత్తు .. మిగతా రైతులకు రూ.20వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఏ2 సురేష్ తో పాటు మరొకరికి మాత్రం బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిగిలిన రైతులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరంతా గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. లగచర్ల కేసులో పోలీసులు నరేందర్ రెడ్డిని ఏ1 నిందితుడిగా పేర్కొంటు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇదికూడా చదవండి…

శరణు.. శరణు.. శబరీ గీరీషా..!