నీవేం కమీషనర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నీవేం కమీషనర్..!
– అధికారిపై కౌన్సిలర్ మండిపాటు
– తాండూరు మున్సిపల్ గేటు వద్ద వాగ్వివాదం
– చర్చనీయాంశమైన సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: నీవేం.. కమీషనర్ అంటూ ఓ కౌన్సిలర్ మున్సిపల్‌ కమీషనర్‌పై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈసంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు కౌన్సిలర్‌గా ముక్తార్ నాజ్ కొనసాగుతున్నారు. అయితే ఓ స్కూల్‌ అనుమతి విషయంలో కమీషనర్‌ శంకర్‌ సింగ్‌ను సంప్రదించారు. ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లించాలని కమీషనర్ శంకర్ సింగ్ సూచించారు. ఇందుకు కౌన్సిలర్ ముక్తార్ నాజ్ సగం ఫీజు చెల్లించి అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై కమీషనర్‌ స్పందించక పోవడంతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అమర వీరుల దినోత్సవం అనంతరం కౌన్సిలర్ ముక్తార్ నాజ్ కమీషనర్‌ శంకర్‌ సింగ్‌ ను కోరారు. కమీషనర్‌ అనుమతులు ఇవ్వలేనని బయటకు వెళ్లిపోయారు. మున్సిపల్ ముఖ ద్వారం ముందు కారులో వెళుతుండగా మళ్లీ కౌన్సిలర్ ముక్తార్ నాజ్ కమీషనర్‌తో వాగ్విదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో కౌన్సిలర్లు సైతం అందరు అక్కడికి చేరుకున్నారు. వారందరి ముందే కౌన్సిలర్ ముక్తార్ నాజ్ కమీషనర్‌ శంకర్‌ సింగ్‌ ను హిందీలో నీవేం కమీషనర్‌, ఎందుకు కమీషనర్‌ అయ్యావని మండిపడ్డారు. ఈ పరిణామానికి కౌన్సిలర్లు నిర్ఘాంతపోయారు. స్థానికులు ఈ సంఘటనను వీడియో కూడా తీశారు. కమీషనర్ వర్సెస్ కౌన్సిలర్ అన్న చందంగా మారిన పరిణామం మున్సిపల్‌ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో కింద ఉంది..

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!


chaithany collage