డేరింగ్ దొంగ..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

డేరింగ్ దొంగ..!
– రైళ్లో గోల్డ్ చైన్‌ చోరీ
– రన్నింగ్‌ ట్రైన్‌ నుంచే జంప్‌
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
దర్శిని డెస్క్‌: దొంగతనాలకు సిద్దపడిన దొంగలు పని అయిపోయాక సాహసాలు చేయాల్సిందే. అలాంటి సాహాసాన్ని చేసిన ఓ దొంగ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్‌ చోరీ చేసి రన్నింగ్ ట్రైన్‌ నుంచే జంప్‌ చేసి పరుగెత్తి జారుకున్నాడు. చెన్నైలో జరిగినీ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన వలర్మతి (43) అనే మహిళా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. విధులు ముగిసిన అనంతరం.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో తిరువళ్లూరు తిరుగుపయనం అయ్యింది. ట్రైన్ బేసిన బ్రిడ్జ్ స్టేషన్‌లో ఆగింది. స్టేషన్ నుంచి ట్రైన్ మెల్లగా కదులుతున్న సమయంలో ఆమె వెనుక నిలబడి ఉన్న యువకుడు మెడలోంచి బంగారు చైన్ లాగేశాడు. కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసి పారిపోయాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ చోరీ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కింద లింకులో చూడండి..

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage