మానవత్వం చాటుకున్న మంత్రి సబితారెడ్డి
– తన కాన్వాయ్‌లో రోడ్డు ప్రమాద బాధితుల తరలింపు
– వికారాబాద్ డెంటల్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించేందుకు చేయూతనందించారు. శుక్రవారం వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో అదే మార్గంలో వెళుతున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. వెంటనే ప్రమాదంలో గాయపడిన బాధితులను తన కాన్వాయ్‌లో వికారాబాద్ ఆసుపత్రికి తరలించేలా పోలీసుల సహాకారంతో చేయూతనందించారు.
ప్రమాదంపై స్పందించి బాధితులను గొప్ప మనసుతో ఆసుపత్రి తరలించేలా మానవత్వాన్ని ప్రదర్శించిన మంత్రి సబితారెడ్డి మనస్థ త్వం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులకు మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. అయితే అంతకుముందు వికారాబాద్ డెంటల్ ఆసుపత్రి వద్ద ఓ గుర్తుతెలియని షిప్టు కారు బైక్‌ను ఢీకొట్టడడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.
