హెల్త్ టెస్టులు పెరిగాయ్..!

ఆరోగ్యం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

హెల్త్ టెస్టులు పెరిగాయ్..!
– ఉచితంగా 134 ఆరోగ్య పరీక్షలు
– ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. మెరుగైన వైద్యలను అందిస్తూ ఆరోగ్యాలకు భరోసా ఇస్తోంది. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఆరోగ్య సేవలు పెంచినట్లు శుభవార్త చెప్పింది. తాజాగా పెంచిన ఆరోగ్య పరీక్షల సేవలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదివరకు ఉచితంగా 54 పరిక్షల సేవలను అందిస్తుండగా వాటిని 134 వైద్య పరీక్షల వరకు పెంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్‌ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్‌, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొవచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్‌ కిట్, గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ అందిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70శాతం అవుతున్నాయి అని హరీశ్‌రావు వెల్లడించారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage