వీవీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

వీవీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రూ. 5 లక్షల నిధుల మంజూరు ప్రొసిడింగ్ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ హై స్కూల్ (వీవీహెచ్ఎస్) అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం పాఠశాల కమిటీ సభ్యులతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటా నిధుల కింద పాఠశాల అభివృద్ధి నిమిత్తం రూ. 5 లక్షల నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసిడింగ్ కాపీలను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యరంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా వీవీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు ఆర్. బస్వరాజ్, జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ బూబ్, ప్రసారం బస్వరాజ్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మసూద్, మన్మోహన్ సార్డా, శెట్టి భాస్కర్, హెచ్ ఎం శరత్కళ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage