ప్రత్యేకం.. పక్కా..!
– ఇంచార్జ్ పాలనకు సన్నహాలు
– ఎల్లుండితో ముగుస్తున్న మున్సిపల్ పాలకవర్గ పాలన
– రేపు చివరి మున్సిపల్ సమావేశం..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలలో ప్రత్యేక పాలన పక్కాగా వస్తోందనే సూచనలు కనిపిస్తున్నారు. ఇందుకు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగగా జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కోడంగల్‌తో అన్ని స్థానాలు బీఆర్ఎస్ నుంచే పాలకవర్గ వర్గాలు కొలువుదీరాయి. తాండూరు, వికారాబాద్ మున్సిపల్‌లో చైర్ పర్సన్‌ల మద్య రెండున్నరేళ్ల పదవి ఒప్పందాలతో పాలన ప్రారంభించారు. పలు వివాధాలతో ఆ ఒప్పందాలు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం జనవరి 26న పాలక వర్గం పదవీ కాలం పూర్తి చేసుకోబోతోంది. అయితే మున్సిపల్ కొత్త పాలకవర్గం కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ కారణంగా మున్సపల్ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించే వరకు మున్సిపల్‌లో ప్రత్యేక పాలన అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంచార్జ్ పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే వికారాబాద్‌లో చివరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రేపు తాండూరులో చివరి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేశారు.
వివాదాలకు నెలవు
తాండూరులో ఈ ఐదేళ్లలో కొత్త మున్సిపల్ కార్యాలయం ప్రారంభంతో పాటు కార్యాలయం ముందు 100 ఫీట్ల జాతీయ జెండా ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచాయి. మొదటి నుంచి తాండూరు మున్సిపల్ పాలనలో వివాదాలు చుట్టుముట్టాయి. చిలుక వాగు బిల్లులతో మొదలై చైర్ పర్సన్ దొంగ ఓటు, బీఆర్ఎస్ పార్టీ స్వపక్షంలోనే ఎదురు దాడులు, అక్రమాలపై లోకాయుక్త కేసులు, అప్పటి ఆర్డీఓ, కలెక్టర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టులో రిట్ పిటిషన్లు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్రమ నిర్మాణాలు, నాన్ వెజ్ టెండర్లలో అవినీతి, జేసీబీ మాయం, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం వంటి ఘటనలతో వివాదాలు చుట్టుముట్టాయి.
ఇదికూడా చదవండి…

