ప్రైవేటు ఆసుపత్రులకు హెచ్చరిక..!
– అన్ని ప్రసవాలను ఈ బర్త్ పోర్టల్‌లో నమోదు చేయాలి
– అనుమతులు లేకుండా అబార్షన్లు చేయొద్దు
– ఆసుపత్రుల తనిఖీలలో వైద్యాధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రైవేటు ఆసుపత్రులలో జరిగే అన్ని ప్రసవాల వివరాలను ఈ బర్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి డా. పల్వన్ కుమార్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు పట్టణంలోని శెట్టి అపెక్స్ ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రసవాలకు సంబంధించి, మహిళలకు అందించే వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలలో జరిగే సాధారణ, సెక్షన్ ప్రసవాల వివరాలను ఖచ్చితంగా ఈ బర్త్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.
గర్భిణీలకు స్కానింగ్ వివరాలను కూడా ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. అన్ని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, క్లీనిక్ లు మెడికల్ కేర్ సముదాయాలు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు వివరాలను ఆన్ లైన్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లోను అనుమతులు లేకుండా అబార్షన్లు చేయలేదన్నారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఈ తనిఖీలో వైద్యాధికారులు ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయిబాబ, జిల్లా మాస్ మీడీయా అధికారి వి.శ్రీనివాస్ లు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

