ఎమ్మెల్సీతో పంచాయతీ కార్మికుల భేటి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్సీతో పంచాయతీ కార్మికుల భేటి
– డిమాండ్ల సాధనపై మెమోరెండం అందజేత
– పరిష్కారానికి భరోసా అందించిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: డిమాండ్ల సాధన కోసం సమ్మెలో ఉన్న పంచాయతీ కార్మికులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో భేటి అయ్యారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్మికులు’ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మెమోరండం అందజేశారు. వెంటనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పంచాయతీ రాజ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి డిమాండ్లను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు, బకాయిలు చెల్లింపులు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఎఈఎస్ఐ వంటి తదితర డిమాండ్లను పరిష్కించేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పీఎసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీఐటీయూ నాయకులు కె. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బిర్కత్ రఘు, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage