తాండూరులో మద్యం షాపులు మూత
– 17వ తేది ఉదయం వరకు విక్రయాలు బంద్
– ప్రకటించిన తాండూరు ఎక్సైజ్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మద్యం షాపులు మూతపడ్డాయి. మద్యం విక్రయాలపై స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలను పురస్కరించుకుని విక్రయాలు నిషేధించినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం నుంచి సోమవారం తెల్లవారు జాము 6 గంటల వరకు మద్యం విక్రయాలు చేపట్టరాదని దుకాణా దారులకు నోటీసులు అందజేశారు. దీంతో శనివారం నుంచి పట్టణంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. విక్రయాలు నిలిచిపోయాయి. పట్టణంలోని మద్యం దుకాణాలు, బార్లు మాత్రమే మూసి ఉంటాయని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

